News January 26, 2025
సంక్షేమ పథకాలు పంపిణీ చేయనున్న మంత్రి సీతక్క

ములుగు నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో రేపు(ఆదివారం) మంత్రి సీతక్క సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ములుగు మండలంలోని జీవంతరావుపల్లి, వెంకటాపూర్ మండలంలోని రామానుజాపూర్, గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామాల్లో సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పథకాలను మంత్రి సీతక్క అందజేయనున్నారు.
Similar News
News February 20, 2025
మెదక్: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

మెదక్ కలెక్టరేట్‌లో ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికల విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులను నిజాయితీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 20, 2025
నేడే టీమ్ ఇండియా తొలి సమరం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉన్న భారత్‌కు బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టం కాకపోవచ్చు. విరాట్, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా లేని బౌలింగ్ దళం ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. అటువైపున్నది బంగ్లాయే అయినా తక్కువ అంచనా వేయొద్దని, నిర్దయగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానుంది.
News February 20, 2025
యాలాల: ఇసుక అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతాం: జిల్లా ఎస్పీ

జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. యాలాల మండల పరిధిలోని కూకట్ గ్రామ సమీపంలోని కాగ్న నదిలో ఇసుక రీచ్లను పరిశీలించారు. ప్రభుత్వ అనుమతులకు సంబంధిత అధికారులచే ఇసుక అనుమతి పొందాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేష్ ఎస్ఐ గిరి ఉన్నారు.