News August 10, 2024
సంగంలో పాల డైరీ ప్రారంభించిన మంత్రి ఆనం

సంగం మండలం, దువ్వూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన ఓ పాల డైరీని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ డైరీని నిర్మించడం అభినందనీయమని నిర్వాహకులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
నెల్లూరు: రాపిడ్ కిట్లే లేవు..!

జిల్లాను స్క్రబ్ టైపస్ వ్యాధి బేంబేలెత్తిస్తుంది. చాప కింద నీరులా కేసులు విస్తరిస్తున్నాయి. బుచ్చిలో ఓ మహిళ విష జ్వరంతో మృతి చెందింది. ఈమెకు ప్రైవేట్ ఆసుపత్రిలో ర్యాపీడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. స్క్రబ్ టైపస్‌తో కాదని విష జ్వరంతో అని వైద్య శాఖ కప్పి పుచ్చుకుంటుంది. ర్యాపిడ్ కిట్లు కూడా వైద్యశాఖ వద్ద లేవు. 500 కిట్లు అడిగి ఉన్నామని DMHO చెబుతున్నా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం.
News December 8, 2025
నెల్లూరులో 100 పడకల ESI హాస్పిటల్

లోక్‌సభలో సోమవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇస్తూ నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి సుశ్రీ శోభా కరండ్లజే వెల్లడించారు. ఈ మేరకు అయన లిఖితపూర్వకంగా సమాధామిచ్చారు. 100 పడకల ESI ఆసుపత్రిని నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిందన్నారు.
News December 7, 2025
నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

ఎస్పీ అజిత ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 50 ప్రత్యేక బృందాలతో నాకా బంది నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా రాత్రి పూట వాహనాల తనిఖీని తీవ్రతరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్‌పై 13 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 11 కేసులు, ఓవర్ స్పీట్/రాష్ డ్రైవింగ్-8 కేసులు, 3-వాహనాలు సీజ్ చేసి, MV యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.1,81,260 జరిమానా విధించారు.


