News August 23, 2025

సంగారెడ్డిలో ఉత్సాహంగా క్రీడలు

image

సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో శనివారం టెన్నికాయిట్ సబ్ జూనియర్ పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. పోటీలను ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు హరికిషన్ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు సుభాష్ గౌడ్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

Similar News

News January 15, 2026

ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

image

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.

News January 15, 2026

పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

image

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.

News January 15, 2026

ఏటూరునాగారం: ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు

image

ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఎదుట ఇద్దరు మావోయిస్టు లొంగిపోయారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధి బందిపార గ్రామానికి చెందిన కుడియం పాండు, టెర్రం పోలీస్ స్టేషన్ పరిధి పెద్దిబట్టిగూడెంకు చెందిన ముచ్చక్కి మంగల్ మద్దెడు ఏరియా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సరెండర్ పాలసీలో భాగంగా వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.