News February 27, 2025
సంగారెడ్డిలో ఓటింగ్ శాతం ఇలా..

సంగారెడ్డి జిల్లాలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం10 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ 8.05 శాతంగా టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ 12.94గా నమోదైనట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Similar News
News March 17, 2025
VJA: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గవర్నర్‌పేట సీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News March 17, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం గిరిప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
News March 17, 2025
రాయచోటి: మండలికి అధ్యక్షత వహించిన మైనార్టీ మహిళ

తొలిసారి డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో మైనార్టీ మహిళ జకియా ఖానం శాసనమండలికి అధ్యక్షత వహించారు. కాగా ఈమె అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వారు కావడం గమనార్హం. అధిపతి లేనప్పుడు ఈ అవకాశం దక్కుతుంది. మైనార్టీ మహిళ YCP తరపున ఎమ్మెల్సీగా ఎంపికవ్వడం, డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో కూర్చోవడం మరో అరుదైన అవకాశం.