News September 11, 2025
సంగారెడ్డి: ‘అనాధలు, వృద్ధులకు యాత్రా దానం’

అనాధలు, వృద్ధులకు యాత్రా దానం ద్వారా తీర్థయాత్రల ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ గురువారం తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రవాస భారతీయులు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
భద్రకాళి అమ్మవారి నేటి దివ్య దర్శనం

వరంగల్ కొంగు బంగారమైన శ్రీ భద్రకాళి ఆలయంలో ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేషమైన అలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. నేడు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 7, 2025
AU మాజీ VC ప్రసాద్ రెడ్డికి జైలు శిక్ష

AU మాజీ VC ప్రసాద్ రెడ్డికి ఒక నెల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. AUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన నూకన్నదొరను తొలగిస్తూ 2022లో ప్రసాద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నూకన్నదొర హైకోర్టును ఆశ్రయించగా.. విధుల్లో కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని అమలు చేయకపోవడంతో హైకోర్టు ఈ శిక్షను విధించింది. అయితే అప్పీల్ చేసుకునేందుకు 6 వారాల సమయం ఇచ్చింది.
News December 7, 2025
విజయవాడలో నేటి నాన్ వెజ్ ధరలివే.!

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.260, స్కిన్ రూ.250 విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు విక్రయదారుల చెబుతున్నారు. మటన్ కేజీ యథావిధిగా రూ.900 వద్ద కొనసాగుతోంది. చేపల్లో బొచ్చ కేజీ రూ.230గా ఉన్నాయి. 30 కోడిగుడ్లు గతవారం రూ.200 ఉండగా నేడు రూ.205కి అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


