News March 5, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి గోవిందురాం పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
MBNR: అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది : కలెక్టర్

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ గురించి స్పష్టతనిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏకగ్రీవమైన పంచాయతీలలో సైతం కోడ్ తప్పనిసరిగా అమలవుతుందని, ఎవరూ నియమాలను అతిక్రమించకూడదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
News December 7, 2025
వామ్మో! HYDలో భారీగా పెరిగిన ధరలు

నగరంలో గుడ్ల ధరలు కొండెక్కాయి. విడిగా కొంటే గుడ్డు రూ.8- 9 వరకు అమ్ముతున్నారు. డజన్ రూ.90కి, ట్రే 220- 230 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్‌లో ఎగ్ డీలర్స్ వద్ద స్టాక్ లేకపోవడం ధరల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్కవుట్స్ చేసే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ గుడ్డే..త్వరగా కర్రీ చేసుకునే బ్యాచిలర్లు ఇబ్బందిగానే మారిందంటున్నారు. 3వారాలుగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
News December 7, 2025
ప్రొద్దుటూరు: రూ.10 లక్షల పెనాల్టీ.!

ప్రొద్దుటూరులో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారంపై జీఎస్టీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్, కొరియర్ కార్యాలయాలు వందకుపైగా ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో బంగారం, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మందులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వీటిపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం దాడులు చేసి ఒక్క రోజులోనే రూ.10 లక్షలు పైగా పెనాల్టీ వసూలు చేశారు.


