News February 17, 2025

సంగారెడ్డి: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మరో అవకాశం

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇటీవలే పూర్తయిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానీ విద్యార్థులకు ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పిస్తుందని సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈనెల 18 నుంచి 22 వరకు నిర్వహించే పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News March 6, 2026

మైనర్లకు SM బ్యాన్.. దేశవ్యాప్తంగా చేయాల్సిందేనా?

image

మైనర్లకు SMను బ్యాన్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. APలో కూడా ఈ తరహా విధానంపై కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించడం అత్యవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజర్లు వీటి బారినపడి అశ్లీలత, సమయం వృథా, చెడు అలవాట్లకు గురవుతున్నారని అంటున్నారు.

News March 6, 2026

తెనాలిలో ఉగాది పురస్కారాల సంబరాలు..!

image

పరాభవనామ తెలుగు సంవత్సరo ఉగాది పురస్కారాల సంబరాలను మా-ఎపి భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆహ్వానించబోతున్నట్లు వివరించారు. తేదీ,వేదిక త్వరలో ప్రకటిస్తామన్నారు.

News March 6, 2026

సూర్యాపేట: కేవైసీ ఉంటేనే ఉపాధి పనులు

image

వచ్చే నెల నుంచి ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు నమోదు చేయనున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన కూలీలకే పనులు కల్పించనున్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్‌లో ప్రతి కూలీ ఫొటోను ఉదయం, మధ్యాహ్నం నమోదు చేసినప్పుడే వేతనాలు చెల్లించనున్నారు. జిల్లాలో 3,21,449మంది కూలీలు ఉండగా, అందులో 2,94,126 మంది (91.55%) ఈ-కేవైసీ పూర్తి చేశారు. హాజరు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.