News March 7, 2025
సంగారెడ్డి: ఇంటర్ రెండో సంవత్సరం మొదటి పరీక్షకు 98.11% హాజరు

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 15,989 మంది విద్యార్థులకు గాను 15,687 మంది విద్యార్థులు హాజరయ్యారని (98.11%)ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 302 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
వరంగల్: చలికాలంలో స్థానిక ఎన్నికల హీట్!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వార్డుల్లో అలకలు, అసంతృప్తులు వ్యక్తమవుతుండగా, కొత్త చేరికలు, తిరుగుబాటు నేతలను బుజ్జగించే ప్రయత్నాలతో పార్టీ కార్యాలయాలు బిజీగా మారాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు, వర్గపోరు కలిసి ఈ చలికాలంలో ఎన్నికల హీట్‌ను పెంచుతున్నాయి.
News December 10, 2025
జగిత్యాల: 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌తో అవినీతికి అడ్డుకట్ట

అవినీతి నిర్మూలనకు ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు నిబద్ధతతో పని చేసి అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
News December 10, 2025
3రోజుల పాటు AP ఛాంబర్స్ బిజినెస్ EXPO

యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. VJAలో ఈ నెల 12,13,14 తేదీల్లో జరిగే EXPOలో మంత్రులు పాల్గొంటారన్నారు. MSME, టూరిజం, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మహిళ సాధికారతపై సెమినార్లు ఉంటాయని చెప్పారు. 160స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎంట్రీ ఉచితమన్నారు.


