News May 7, 2025
సంగారెడ్డి: ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు లబ్ధిదారులు, అధికారులు వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. ఝరాసంగం, న్యాల్ కాల్ మండల కేంద్రాల్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు రూ.1 లక్ష చెక్కులను పంపిణీ చేశారు.
Similar News
News February 11, 2026
తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
News February 11, 2026
మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.
News February 11, 2026
ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం


