News March 7, 2025

సంగారెడ్డి: ఈనెల 10 నుంచి ఎఫ్ఎల్ఎన్ సర్వే

image

సంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈనెల 10 నుంచి12వ తేదీ వరకు ఎఫ్ఎల్ఎన్ సర్వేను నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తామన్నారు.

Similar News

News December 16, 2025

విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

image

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్‌లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.

News December 16, 2025

క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

image

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News December 16, 2025

గుంటూరులో అదృశ్యం.. హైదరాబాద్‌లో ప్రత్యక్షం

image

గుంటూరులో అదృశ్యమైన ఇద్దరు బాలురు హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. లాలాపేటకు చెందిన రెహమాన్ బాషా, నరసరావుపేటకు చెందిన జవాద్ మల్లారెడ్డి నగర్ మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఫంక్షన్ వచ్చి ఈ నెల 14న అదృశ్యమయ్యారు. అయితే రహమాన్ బాషా తల్లిదండ్రులు గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు రహమాన్ తన స్నేహితుడు జావాద్‌ని కూడా వెంట పెట్టుకొని వెళ్లాడు.