News August 12, 2025
సంగారెడ్డి: ఈనెల 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. శిక్షణకు 172 మంది లైసెన్స్ సర్వేలను ఎంపిక చేసినట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్‌లో 50 రోజులపాటు శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి విడత 160 మందికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. వీరిలో 129 మందికి 28 మండలాలు కేటాయించినట్లు తెలిపారు.
Similar News
News March 13, 2026
మంచిర్యాల: ఎస్సీ యువతకు GOOD NEWS

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి పెంపొందించాలే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ నెల 17 నుంచి 24లోపు https:tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 13, 2026
దేవగిరి నగరం రాక్షస గుహలను పరిశీలించిన ఎస్పీ

పినపాక మండలంలోని పాండురంగాపురం పంచాయతీ పరిధిలో గల దేవగిరి నగరం రాక్షస గుహలను ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. శుక్రవారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, గుహల విశిష్టతను, అక్కడి భౌగోళిక పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల భద్రత, అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.
News March 13, 2026
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రముఖులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ విక్రాంత్ హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పోస్టులు చేస్తే గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.


