News August 21, 2025
సంగారెడ్డి: ఈనెల 22న ఉపాధి హామీ పనుల జాతర

జిల్లాలో ఈనెల 22న ఉపాధి హామీ పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. మొత్తం 2,451 పనులకు రూ.1,959.52 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించాలని పేర్కొన్నారు. ఒక గ్రామాన్ని యూనిట్‌గా ఎంచుకొని శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని సూచించారు.
Similar News
News January 21, 2026
VZM: రబీ లక్ష్యం దాటిన ఉద్యాన మిషన్

జిల్లాలో రబీ సీజన్‌లో ఉద్యాన సాగు లక్ష్యాన్ని మించి పెరిగిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లక్ష్యంగా పెట్టుకున్న 4,000 ఎకరాలకు బదులుగా 4,800 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఖరీఫ్‌లో మరో 6,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
News January 21, 2026
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కమ్మర్‌పల్లి విద్యార్థినులు

కమ్మర్‌పల్లి ZPHS విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలకు ఈ పాఠశాలకు చెందిన భవాని, వర్షిత్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సాయన్న, PD వేముల నాగభూషణం తెలిపారు. మినీ స్టేడియంలో జరిగిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన వీరు, త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
News January 21, 2026
T20WC ఆడతామో.. లేదో: బంగ్లా కెప్టెన్

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని చెప్పారు.


