News May 7, 2025

సంగారెడ్డి: ఈనెల 28, 30న రినివల్ శిబిరం

image

సంగారెడ్డి జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 28, 30న దివ్యాంగులకు యూడీఐడీ సదరం రినివల్ శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారం తెలిపారు. శిబిరం కోసం స్లాట్‌ను నిరంతరం బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించి శిబిరంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు.

Similar News

News February 13, 2026

సామాన్య భక్తురాలిగా నంద్యాల కలెక్టర్ దర్శనం

image

శ్రీశైల క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శుక్రవారం సాధారణ భక్తురాలిగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత క్యూ లైన్ నుంచి వెళ్లి 20 నిమిషాల్లోనే దర్శనం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News February 13, 2026

కామారెడ్డి: 14, 32 వార్డులో గెలుపొందిన పిన్న వయస్కుకులు

image

కామారెడ్డి మున్సిపాలిటీలో ఫలితాలు ఒక్కొక్కటి వెలవడుతున్నాయి. 32 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గ్యార అఖిల విజయం సాధించగా, 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ శెట్టి హర్షిత గెలుపొందారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీలో అతిపిన్న వయసున్న ఇద్దరు మహిళలు గెలుపొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత సైతం రాజకీయాల్లో రాణించగల నమ్మకం ఏర్పడినట్లు అయింది.

News February 13, 2026

15 చోట్ల హంగ్.. ఇండిపెండెట్లే కీలకం

image

TG: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏకంగా 15 చోట్ల హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, అలియాబాద్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు ఇండిపెండెంట్ల ఓట్లు, అలాగే ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి.