News March 13, 2025
సంగారెడ్డి: ఈ నెల15 నుంచి ఒంటిపూట బడులు: DEO

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర యాజమాన్య పాఠశాలలు ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.
Similar News
News February 8, 2026
చిత్తూరు జిల్లాలో కోడి ధర KG రూ.140

చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.132-రూ.140 లవరకు ఉంది. మాంసం రూ.191-రూ.216 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.218 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75 గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 8, 2026
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ లో తప్పిదాల సవరణకు అవకాశం కల్పించారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఆన్ లైన్లో సవరణలు చేసుకునేందుకు హెచ్ఎం లాగిన్‌లో అవకాశం కల్పించారన్నారు. దీన్ని ఆయా హెచ్ఎంలు సద్వినియోగం చేసుకుని, ఈనెల 12వ తేదీ లోపు తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలన్నారు.
News February 8, 2026
ప్రచారానికి రేపే ఆఖరు.. నేతలపై ఒత్తిళ్లు

TG: మున్సిపోల్ ప్రచారానికి రేపు సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమతమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని ముఖ్యనేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, BRSలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ ఉండగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.


