News February 15, 2025
సంగారెడ్డి: ఎక్కడ చూసినా అదే చర్చ

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల హీట్ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News April 14, 2026
క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News April 14, 2026
VZM: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ భార్యాభర్తలు అరెస్ట్

ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను VZM 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.5లక్షల విలువైన 49.147 కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లు, రూ.650 స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు. కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు వరుణ్‌కుమార్ మణి, నిషా బైరపురంతో సహా మరో ఇద్దరు గూడ్స్ షెడ్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది.
News April 14, 2026
విశాఖ: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు

ఆనందపురంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గుడిలోవలోని శివాలయానికి వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్ బంక పైడి రాజు(25), ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక హాస్పిటల్‌కు తీసుకువెళ్తుండగా పైడి రాజు మృతిచెందారు. హార్ట్ అటాక్ రావడంతోనే చనిపోయారని వైద్యుల నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.


