News February 11, 2025

సంగారెడ్డి: ఎన్నికలకు జోనల్ అధికారుల నియమకం

image

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం మండలాల వారిగా జోనల్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ వనరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో మండలానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులను జోనల్ అధికారులుగా నియమించారు. జోనల్ అధికారులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.

Similar News

News February 13, 2026

సచ్చిదానంద సరస్వతి స్వామి మృతి పట్ల జగన్‌ సంతాపం

image

తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి శివైక్యం చెందడంపై మాజీ సీఎం జగన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామివారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది, భక్తులను సన్మార్గంలో నడిపించారని స్మరించుకున్నారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని, భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

News February 13, 2026

మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

image

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

రాయికల్‌లో ‘కమలం’ జోరు

image

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 12 వార్డులకు గాను బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 3 వార్డుల్లో జయకేతనం ఎగురవేయగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ‘స్వతంత్ర’ అభ్యర్థి మద్దతు కీలకం కానుంది.