News October 8, 2025

సంగారెడ్డి: ‘ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి’

image

ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్టేజి వన్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ ప్రక్రియపై శిక్షణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులు, సమయపాలన కీలకమని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తమ విధుల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News January 17, 2026

PHOTOS: HYDలో అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ షో

image

TG: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 18 బెలూన్స్ గాల్లో సందడి చేస్తున్నాయి. గోల్కొండ వద్ద ఆకాశం నుంచి తీసిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. అటు ఇవాళ ఉదయం ఓ బెలూన్ సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.

News January 17, 2026

రాహుల్‌‌ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

image

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.

News January 17, 2026

వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

image

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం‌ జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.