News February 4, 2025
సంగారెడ్డి: ఓపెన్ విద్యార్థులు మరో అవకాశం: DEO

ఓపెన్ స్కూలో పది, ఇంటర్ చదివే విద్యార్థులు ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు రూ.50 ఆలస్య రుసుంతో చెల్లించవచ్చని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని తెలిపారు.
Similar News
News February 19, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చిరంజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.
News February 19, 2025
జగన్‌కు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి పెమ్మసాని

AP: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఆ 11 సీట్లు కూడా రావని, ఒక్క సీటుకే పరిమితమవుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘జగన్ భాష, వ్యవహారంతో వైసీపీకి కష్టాలు తప్పవు. ఆయన హయాంలో YCP నేతలతో చేయకూడని పనులు చేయించారు. వాటిపైనే ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
News February 19, 2025
గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. బ్లూ కోర్టు, పెట్రో కార్ సిబ్బంది, 100 డైల్స్ కి తక్షణమే స్పందించాలని కోరారు. ఆయన వెంట సిఐ శ్రీనివాస్, ఎస్ఎస్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.