News May 7, 2025

సంగారెడ్డి ఓపెన్ స్కూల్ పరీక్షలో ఇద్దరు డిబార్

image

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని డిబార్ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పదవ తరగతికి 11, ఇంటర్మీడియట్ కు 17 పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు గ్రాండ్ వెల్కమ్

image

AP: అమరావతి పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద గేట్స్‌కు పుష్పగుచ్ఛం అందించి వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌తో బిల్‌గేట్స్ భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చించనున్నారు.

News February 16, 2026

అనకాపల్లిలో ఒంటరి మహిళ సజీవ దహనం

image

అనకాపల్లి పట్టణంలోని గూడ్స్ రోడ్డు వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్రహరీకు ఆనుకుని ఉన్న ఒక రేకుల షెడ్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ నివసిస్తున్న లింగాల తలుపులమ్మ (45) అనే ఒంటరి మహిళ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. చలి కారణంగా వేడి కోసం వెలిగించిన కుంపటి వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ అధికారులు, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

News February 16, 2026

పార్వతీపురం: బస్సు అంటే భయం!

image

ఒడిశా ఆర్టీసీ బస్సులలో ప్రయాణంపై జిల్లా ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలే దీనికి కారణం. నిత్యం ఒడిశా నుంచి ఆంధ్రాకు రాత్రి పూట ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. పి.కొనవలస ఘాట్ రోడ్డులో అత్యధిక మలుపులు కారణంగా బస్సులో సాంకేతిక సమస్యలు వచ్చి ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నారు. గత మూడు నెలల క్రితం ఒక బస్సు దగ్ధం అవ్వగా, నిన్న సాలూరులో బస్సు బోల్తా పడింది.