News March 7, 2025
సంగారెడ్డి: కలెక్టరేట్లో మహిళా దినోత్సవం వేడుకలు

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. మహిళల గొప్పతనం గురించి వివరించి, మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగస్తులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
Similar News
News March 19, 2025
సిరిసిల్ల: ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన గౌడ సంఘం నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి గితేను జిల్లా గౌడ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్‌తో పాటు నాయకులు సిరిసిల్ల ప్యాక్స్ ఛైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాల్ రెడ్డి, బోయిన్పల్లి మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, గాదగోని సాగర్ గౌడ్‌లు ఎస్పీని శాలువాతో సత్కరించి సన్మానించారు.
News March 19, 2025
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.
News March 19, 2025
సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 79 కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని సూచించారు.