News March 13, 2025

సంగారెడ్డి: కారు టైర్ పేలి యువకుడి మృతి

image

కొండాపూర్ మండలం మల్కాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. కుకట్ పల్లికి చెందిన మహమ్మద్ మొహరోజ్ కారులో కోహీర్ వెళ్తున్నాడు. మల్కాపూర్ వద్ద కారు టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొంది. దీంతో మహమ్మద్ మొహరోజ్ అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారికి స్వల్ప గాయలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భరత్ తెలిపారు.

Similar News

News February 17, 2026

ఘనంగా యాదాద్రి శ్రీరామలింగేశ్వర స్వామికి రథోత్సవం

image

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి‌. ఇందులో భాగంగా సోమవారం రాత్రి దివ్య విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శివపార్వతులను రథంలో ఉంచి, పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

News February 17, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 72 పిటిషన్ల స్వీకరణ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ జగదీశ్ 72 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా కార్యాలయానికి విచ్చేసిన ఓ దివ్యాంగురాలి వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి పిటిషన్ స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.

News February 17, 2026

ఆలేరు: అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

అదుపుతప్పి కారు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో తన తల్లి అంత్యక్రియలు హాజరయ్యేందుకు ఆలేరు నుంచి క్వాలిస్ వాహనంలో తూర్పు గూడెం వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో మల్లిక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.