News November 19, 2025
సంగారెడ్డి: కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పత్తి, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు పారదర్శకంగా జరగాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బాధ్యతలు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాదిరి పాల్గొన్నారు.
Similar News
News January 14, 2026
కామారెడ్డి: పండుగ పూట విషాదం

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. కొంపల్లి సాయిలు గ్రామ శివారులోని లింగోష్ పల్లి చెరువు వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు మృతుని కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడని ఎస్ఐ చెప్పారు.
News January 14, 2026
ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.
News January 14, 2026
NTR: సారోళ్లు రూల్స్ చెప్తారు.. అమలు చేయరు.!

సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ పతాక స్థాయికి చేరింది. HYD నుంచి APకి వెళ్లే బస్సు టికెట్ ధరలు రూ.6వేలు దాటడం గమనార్హం. ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామన్న రవాణా శాఖ అధికారులు.. క్షేత్రస్థాయిలో కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.


