News November 7, 2025
సంగారెడ్డి: క్రైమ్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ

జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్‌బీను ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో నమోదైన ప్రతి కేసును ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ తనిఖీలో డీసీఆర్‌బీ డీఎస్పీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News January 20, 2026
అన్నమయ్య జిల్లాలో 41 బస్సులపై కేసులు

అధిక ఛార్జీలు వసూలు చేసిన 41బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ వెల్లడించారు. రవాణశాఖ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వరకు ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని ఎంవీఐ దినేష్ చంద్ర తెలిపారు. ఈక్రమంలో వివిధ బస్సులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
News January 20, 2026
తడ: అపాచీ కంపెనీలో కార్మికుడు మృతి

తడ మండలం మాంబట్టు సమీపంలోని అపాచీ కంపెనీలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నాయుడుపేట(M) తన్నమాల గ్రామానికి చెందిన యుగంధర్ కంపెనీ బాత్రూంలో ఉరి వేసుకున్నట్లు తోటి కార్మికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 20, 2026
గ్రామ పటాల లోపాలతో ఇబ్బందులు.. రీసర్వేతో పరిష్కారం: భూపాలపల్లి కలెక్టర్

జిల్లాలో గ్రామ పటాలు లేకపోవడం, భూ హద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న గట్టు వివాదాలకు పరిష్కారంగా ప్రభుత్వం 13 గ్రామాల్లో రీసర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రీసర్వేతో పొలాల హద్దులు, రోడ్లు, కాలువలు కచ్చితంగా గుర్తించి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా రైతుల భూ వివాదాలు తగ్గి, లావాదేవీలు సులభమవుతాయని తెలిపారు.


