News March 5, 2025

సంగారెడ్డి: ‘గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

image

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.

Similar News

News January 14, 2026

NGKL జిల్లా ప్రజలకు కలెక్టర్ భోగి శుభాకాంక్షలు

image

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ తెలుగు లోగిళ్లు గ్రామీణ శోభతో, అలనాటి అనుభూతులతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పండుగ సమయానికి తమ గ్రామాలకు చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.

News January 14, 2026

తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

image

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.

News January 14, 2026

పితృ దేవతలకు నేడు తర్పణాలు వదిలితే..

image

మకర సంక్రాంతి ఎంతో పవిత్ర దినం. తండ్రీకొడుకులైన సూర్యశనుల కలయికకు ఇది ప్రతీక. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. కొత్త కుండలో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారు. శని దోష నివారణకు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేస్తారు. పంట చేతికి వచ్చే ఈ ‘కుప్ప నూర్పిడుల పండుగ’ వెలుగును, ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే గొప్ప వేడుక.