News August 23, 2025
సంగారెడ్డి: గణేశ్ చవితి.. డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ

వినాయక మండపాల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్పీ పారితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. భక్తి గీతాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా చూసుకోవాలని చెప్పారు. పోలీసుల సూచనలు వినాయక విగ్రహ మండప నిర్వాహకులు పాటించాలన్నారు. ప్రతి మండపం ఆన్ లైన్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News January 15, 2026
డోన్: రైలు కింద పడి వ్యక్తి మృతి

డోన్ మం. దొరపల్లె రైల్వే గేట్ సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చిట్యాలకు చెందిన తలారి మధుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News January 15, 2026
ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
News January 15, 2026
HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్‌తో రంగుల బెలూన్‌లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్‌కు భారీగా తరలిరానున్నారు.


