News August 22, 2025

సంగారెడ్డి: జిల్లాలో 40 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి

image

సంగారెడ్డి జిల్లాలో 40 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలను శుక్రవారం విధుల్లో చేరాలని సూచించారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను అభినందించారు.

Similar News

News January 20, 2026

గద్వాల్: మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

image

గద్వాల్ జిల్లాలో మహిళ రైతు ఉత్పత్తిదారుల కంపెనీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీఓ నరసింగరావు తెలిపారు. అలంపూర్ బాల బ్రహ్మేశ్వర ఉమెన్ FPCలో CEO–01 (జీతం రూ.15,000), మల్దకల్ జోగులాంబ ఉమెన్ FPCలో అకౌంటెంట్–01 (జీతం రూ.6,000) పోస్టులు ఉన్నాయి. అర్హతలతో కూడిన దరఖాస్తులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు కలెక్టర్ కార్యాలయం రూం నం. F-29లో అందజేయాలన్నారు.

News January 20, 2026

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలి- కలెక్టర్

image

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించి ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ క్లినిక్‌లు, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి నూటికి నూరు శాతం పరిష్కారం చూపాలన్నారు.

News January 20, 2026

హనుమకొండ: ‘ట్రాఫిక్ రూల్స్ పోలీసులకు వర్తించవా..?’

image

హనుమకొండ జిల్లా కేంద్రంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఫొటోస్ తీస్తూ చలాన్ వేస్తున్న పోలీసులకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా అంటూ పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నగరంలో పలువురు పోలీసులు హెల్మెట్ లేకుండానే యథేచ్ఛగా బైక్‌లు నడుపుతున్నారని తెలిపారు. అంతేకాకుండా పలువురు పోలీసులైతే ఓ వైపు ద్విచక్ర వాహనం నడుపుతూనే మరోవైపు ఫోన్ మాట్లాడుతున్నారని, రాంగ్ రూట్‌లో కూడా వెళ్తున్నారన్నారు.