News March 11, 2025
సంగారెడ్డి: జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం కలిశారు. ఎస్పీగా బదిలీపై వచ్చిన పారితోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ ఎస్పీగా పని చేసిన చెన్నూరి రూపేష్ హైదరాబాదులోని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీపై వెళ్లారు.
Similar News
News March 26, 2025
YS జగన్ పెద్దమ్మ మృతి

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ(85) ఇవాళ పులివెందులలో కన్నుమూశారు. ఈమె దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల కిందట జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.
News March 26, 2025
జగిత్యాల: గణితం పరీక్షకు రెగ్యూలర్‌కు 5 విద్యార్థులు గైర్హాజరు

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నాలుగోరోజు గణితం పేపర్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11855 విద్యార్థులకు 11850 విద్యార్థులు హాజరయ్యారు. 5 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.96%.సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 133 విద్యార్థులకు 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరు శాతము 89.47% అని అధికారులు తెలిపారు.
News March 26, 2025
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC-YPR(నెం.02863), ఏప్రిల్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, రాజమండ్రి, దువ్వాడ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.