News December 1, 2025
సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ పారితోష్ పంకజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది సమస్యలు విన్నవించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు.
Similar News
News February 12, 2026
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: అనకాపల్లి ఎస్పీ

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. బుధవారం రాత్రి అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
News February 12, 2026
NLR: దొంగతనం నింద వేశారని విద్యార్థి సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. టీపీగూడూరు(M) మండలం పేడూరు గమ్మళ్లపాలేనికి చెందిన యువకుడు(16) ఓ ప్రైవేట్ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. అతను చదివే స్కూల్లో నగదు దొంగతనం జరిగిందని.. విద్యార్థే చోరీ చేశాడని టీచర్లు నిలదీశారంట. నింద భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.
News February 12, 2026
కంది ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసోసియేట్, అటెండెంట్ విభాగాల్లో మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 13వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


