News February 10, 2025

సంగారెడ్డి: టాలెంట్ టెస్ట్‌తో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి..

image

టాలెంట్ టెస్ట్‌తో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలో పదవ తరగతి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రం టాలెంట్ టెస్ట్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2026

విశాఖ డెయిరీ పాల రేట్లు ఎంత పెరిగాయంటే..

image

విశాఖ డెయిరీ పాల అమ్మకం ధరలను పెంచింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అర లీటర్ హోమోజినైజ్డ్ డబుల్ డోన్డ్ పాలు ధర రూ.26 నుంచి రూ.27కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాల ధర అర లీటరు రూ.28 నుంచి రూ.29కు పెంచింది. స్టాండర్ డైజ్డ్ పాలు అర లీటరు రూ.31 నుంచి రూ.32కు, ఫుల్ క్రీం పాలు లీటరు రూ.66 నుంచి రూ.68కు పెరిగింది.

News February 16, 2026

నిజమాబాద్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క

image

నేడు జరగనున్న నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క నగరానికి రానున్నారు. తొలుత కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. MIM కార్పోరేటర్‌లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోనున్న సంగతి తెలిసిందే.

News February 16, 2026

సిద్దిపేట: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఛైర్మన్ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేస్తున్నామన్నారు.