News February 7, 2025
సంగారెడ్డి: డబుల్ డెక్కర్ రైలును చూశారా..!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో డబుల్ డెక్కర్ రైలు నిలిచింది. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ రైలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి వెళుతుండగా జహీరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. దాంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అరుదైన డబుల్ డెక్కర్ రైలును ఆసక్తిగా తిలకించారు. స్టేషన్‌లోని ప్యాసింజర్లు ప్లాట్ ఫామ్ వద్ద డబుల్ డెక్కర్ రైలుతో సెల్ఫీ ఫోటోలు దిగి సందడి చేశారు.
Similar News
News February 13, 2026
BIG BREAKING: నిర్మల్‌లో కాంగ్రెస్ విజయం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు బీజేపీ, ఎంఐఎం 2, BRS 1 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ MLA మహేశ్వర్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.
News February 13, 2026
BREAKING: నర్సంపేట పీఠం కాంగ్రెస్‌దే

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 30 వార్డులకు గాను 20 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16 కంటే అదనంగా మరో నాలుగు స్థానాలు దక్కాయి.
News February 13, 2026
ఏలూరు: హత్య కేసులో జీవిత ఖైదు

దెందులూరు మండలం గాలాయగూడెంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితుడు పాలడుగుల దుర్గాప్రసాద్‌కు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. 2022లో నమోదైన ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసినట్లు దెందులూరు ఎస్సై శివాజీ వెల్లడించారు.


