News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 14, 2025

సిద్దిపేట: దరఖాస్తుల ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఆదర్శ పాఠశాలలో అతిథి ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.నర్సింహులు తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పాఠశాలలో TGT మ్యాథ్స్, PGT మ్యాథ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News December 14, 2025

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు: నాగబాబు

image

AP: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు, MLC నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(D) లావేరులో జరిగిన జనసేన మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘MLAగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని. 5-6 ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెబుతాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది’ అని తెలిపారు.

News December 14, 2025

వరంగల్: 18.82% పోలింగ్ @9AM

image

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.