News March 11, 2025

సంగారెడ్డి: దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు: కలెక్టర్

image

ప్రభుత్వ బడుల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలోని భవిత కేంద్రంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఉపకరణాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, విలీన విద్యా సమన్వయకర్త వెంకటేశం పాల్గొన్నారు.

Similar News

News January 15, 2026

ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

image

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్‌ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.

News January 15, 2026

MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>MOIL<<>> లిమిటెడ్‌లో 67 గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech(మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), MSc( జియాలజీ), PG(సోషల్ వర్క్)ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBDలకు ఫీజులేదు. సైట్: https://www.moil.nic.in

News January 15, 2026

సంక్రాంతి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

image

AP: గోదావరి జిల్లాలను మరిపించేలా ఈసారి తెనాలి వాసులు అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. రకరకాల పిండి వంటలు, ఫలహారాలు, పండ్లతో భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.