News August 20, 2025
సంగారెడ్డి: ‘నిబందనలు ఉల్లంఘిస్తే చర్యలు’

వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా శాంతి భద్రతల కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. వినాయక ప్రతిమలు ప్రతిష్టించేవారు ఆన్లైన్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, నిబందనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.
Similar News
News January 20, 2026
నిర్మల్: దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి

2024–25 సంవత్సరానికి నిర్మల్ జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి తెలిపారు. ఈ నెల 30 వరకు https://tgobmms.cgg.gov.inలో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News January 20, 2026
రాష్ట్రంలో 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ డిస్ట్రిక్ కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr. అసిస్టెంట్, ఎగ్జామినర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in
News January 20, 2026
గ్రీన్‌లాండ్ టెన్షన్.. కుదేలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిఫ్టీ 353 పాయింట్లకుపైగా పడిపోయి 25,232 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1065 పాయింట్లకు పైగా నష్టపోయి 3 నెలల కనిష్ఠమైన 82,180కి చేరింది. గ్రీన్‌లాండ్‌పై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపులతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.


