News August 11, 2025

సంగారెడ్డి: నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ గడువు

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ (1,2,3&4) RRB, SSC & బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు గడువు నేటితో ముగియనుందని జిల్లా బీసీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు https://tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 9, 2026

అమరావతిలో తుది దశకు పొట్టి శ్రీరాములు విగ్రహ పనులు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం 6.8 ఎకరాల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించింది. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన చేతుల భాగాన్ని పైకి ఎత్తుతూ అమరుస్తున్నారు. ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.

News March 9, 2026

SKLM: విద్యార్థులు అలర్ట్.. ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్ డే

image

ఎచ్చెర్లలోని డాక్టర్ B.R.అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ 2021-22, 2022-23, 2023-24 అడ్మిటెడ్ బ్యాచ్ ఆరో సెమిస్టర్ ఇంటర్న్ షిప్ ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు రూ.1425లను ఆయా కళాశాలలో, యూనివర్సిటీకి వచ్చి చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ ఎం.అనురాధ ప్రకటనలో వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో ఈ నెల 10 వరకు, రూ.1500 ఫైన్‌తో 11 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు అన్నారు.

News March 9, 2026

సూర్యాపేట: సైబర్ నేరాలు.. ఊరు వదిలి వెళుతున్నారు

image

సూర్యాపేట జిల్లాలో ఇటీవల కొంతమందిపై సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. భయంతో కొంతమంది సైబర్ నేరగాళ్లు గ్రామాలు వదిలి వెళుతున్నట్లు సమాచారం. HYDతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఉంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. సైబర్ నేరాల్లో జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.