News December 3, 2025
సంగారెడ్డి: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లోని 234 సర్పంచ్, 1,960 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు
Similar News
News February 13, 2026
సిరిసిల్ల: నేడే ‘పుర’ తీర్పు.. మరికొద్ది గంటల్లో ఫలితాలు

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటలలో తేలనుంది. వేములవాడలోని 28 వార్డులలో 113 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 77.99 శాతంతో 31,881 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం సినారే కళామందిరం కౌంటింగ్ కేంద్రంలో వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్‌లో 1000 ఓట్లు లెక్కించనుండగా, 1000లోపు ఓట్లు పోలైన 3 వార్డుల్లో తొలి రౌండులోనే ఫలితం వెలువడనుంది.
News February 13, 2026
గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
News February 13, 2026
NRPT: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత!

NRPT జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 550 మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


