News December 1, 2025
సంగారెడ్డి: నేడు ఎన్నికల విధులపై శిక్షణ

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు నేడు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు శిక్షణకు హాజరు కావాలని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 15, 2026
పెద్దపల్లి: రేపు తెలంగాణ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూలింగ్

రైలు నంబర్ 12723 హైదరాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రేపు 3 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నట్లు నేడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రైలును 3 గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల ప్రయాణికులు సమయ పాలన మార్పు గమనించాలని సూచించారు.
News February 15, 2026
నర్సంపేటలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో నకిలీ కంపెనీలు సృష్టించి సుమారు రూ.2.50 కోట్లు మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. వేర్వేరు అడ్రస్‌లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. నిందిత మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్ నడుపుతున్నట్లు సమాచారం. ఆమె స్వగ్రామం లక్నేపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.
News February 15, 2026
రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.


