News September 12, 2025
సంగారెడ్డి: నేడు జాబ్ మేళా

సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 12న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఫార్మసీలో ఫార్మసిస్ట్, అన్నపూర్ణ ఫైనాన్స్‌లో ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదో తరగతి, బీ ఫార్మసీ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
అచ్చంపేట: ఎన్నికల శిక్షణలో వసతుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం

మొదటి విడత పంచాయతీ ఎన్నికల శిక్షణకు హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సరైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టి.ఎస్.యు.టి.ఎఫ్.) జిల్లా అధ్యక్షులు ఆర్. కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ శర్మ విమర్శించారు. జిల్లా అధికారులు చొరవ తీసుకొని సరైన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
News December 7, 2025
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 279 మంది హాజరు

విశాఖలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ఆదివారం జరిగింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 349 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 279 మంది హాజరయ్యారని డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎంపికైన వారికి సివిల్స్ పరీక్షకు శిక్షణ ఇస్తామన్నారు.
News December 7, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా హైదరాబాద్(HYB)-భువనేశ్వర్(BBS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-BBS రైలును 2026 JAN 27 వరకు ప్రతి మంగళవారం, నం.07166 BBS- HYB మధ్య నడిచే రైలును 2026 JAN 28 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.


