News February 8, 2025

సంగారెడ్డి: నేడు పాఠశాలలకు పని దినం: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యంకు సంబంధించిన పాఠశాలలు రేపు పని చేస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, రేపు పాఠశాలల యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల హెచ్ఎమ్‌లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News February 7, 2026

HYD: ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య.. లాస్ట్‌ కాల్ ఆయనతో!

image

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన విజయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చెంగిచర్లలోని ఆమె నివాసాన్ని రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్‌ బుక్కులు, చెక్‌ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ డాటా సేకరించారు. చివరి కాల్ సోదరుడితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిపారు.

News February 7, 2026

ఏలూరు: ‘ఆయిల్ ఫామ్ లో కొబ్బరి సాగు లాభమే’

image

ఏలూరు జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి చూపాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి పంటలను మరింత విస్తీర్ణంలో సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ ఫామ్‌లో కొబ్బరిసాగు అధిక లాభాలు తెస్తుందని, ప్రకృతి సాగు నిరూపిస్తుందని రైతుకు క్లుప్తంగా వివరించాలని అధికారులకు సూచించారు.

News February 7, 2026

ఆదిలాబాద్: ప్లీజ్.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి !

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గతంలో గెలిచిన వారు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తుండగా.. కొత్తగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం ‘గతంలో గెలిచిన వారు ఏం చేశారో మీకు తెలుసు, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అంటూ ఓటర్లను ప్రార్థిస్తున్నారు. ఆశావహుల వినూత్న ప్రచారంతో వార్డుల్లో ఎన్నికల వేడి పెరిగింది.