News January 21, 2026
సంగారెడ్డి: నేడు సదరం శిబిరం

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 10 గంటలకు సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఆన్ లైన్‌లో ఫ్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే సదరం శిబిరానికి హాజరు కావాలని చెప్పారు. చరవాణికి వచ్చిన సందేశంతో శిబిరానికి హాజరుకావాలని పేర్కొన్నారు.
Similar News
News February 15, 2026
ఏలూరు: నిబంధనలు గాలికి.. రోడ్డు మార్జిన్లలో నాసిరకం మట్టి!

జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న రహదారుల మార్జిన్లలో ఎర్ర కంకరకు బదులు ‘శుద్ధ మట్టి’ని పోయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. శుద్ధ మట్టికి జారుడు గుణం ఎక్కువగా ఉండటంతో వర్షం పడినప్పుడు వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గట్టిదనం ఉండే ఎర్ర కంకరునే వాడాలని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చేలా ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
News February 15, 2026
వేములవాడ: భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం!

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకోవాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు పార్కింగ్ స్థలం వరకు భక్తులను తరలించడానికి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 14, 15, 16వ తేదీలలో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
News February 15, 2026
పలాస కళాకారుడి అద్భుతం.. !

మహాశివరాత్రి పురస్కరించుకొని పలాసకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేశ్ ఆచారి తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపై శివలింగం, ఓంకారాన్ని అత్యంత సుందరంగా చెక్కి అందరినీ అబ్బురపరిచారు. సుమారు 5 గంటల శ్రమతో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రథసప్తమి లోగో, అతిచిన్న ప్రపంచ కప్ వంటి ఆకృతులతో రమేశ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.


