News March 5, 2025
సంగారెడ్డి: పది ఫ్రీ ఫైనల్ పరీక్ష సమయంలో మార్పు: డీఈవో

జిల్లాలో ఈ నెల 6 నుంచి నిర్వహించే పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షల సమయంలో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా మధ్యాహ్నం 12.15 నిమిషాల నుంచి 3.15 (3 గంటలు) నిమిషాల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News December 17, 2025
నంద్యాల: ఈనెల 23న జాబ్ మేళా

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ అన్నారు. నంద్యాలలో ఈ నెల 2న స్థానిక నేషనల్ డిగ్రీ కాలేజీలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుపేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్‌ను జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి విడుదల చేశారు.
News December 17, 2025
ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.
News December 17, 2025
నేడే మూడో విడత పోలింగ్

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.


