News November 16, 2025

సంగారెడ్డి: పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

image

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి, మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు సంగారెడ్డిలో జరిగాయి. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా జట్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్లు చింతా బలరాం, డా.గిరి, ఉపాధ్యక్షులు డా.శ్వేత, ఆంజనేయులు, యాదగిరి, ప్రధాన కార్యదర్శి వరప్రతాప్, సహాయ కార్యదర్శి అరుంధతి, వెంకటేశం, కోశాధికారి శివకుమార్ ఉన్నారు.

Similar News

News January 13, 2026

జనగామ జిల్లా సర్పంచ్‌లకు శిక్షణ శిబిరాలు!

image

జనగామ జిల్లాలో కొత్తగా ఎన్నికైన 280 మంది సర్పంచ్‌లకు ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 20 వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. తొలి విడతలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్లలోని 91 మందికి, రెండో విడతలో జనగామ, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పులలోని 79 మందికి, 3వ విడతలో స్టే.ఘ, చిల్పూర్, రఘునాథపల్లి, జఫర్ గఢ్, లింగాల ఘనపూర్లోని 110 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

News January 13, 2026

సంక్రాంతి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

image

TG: తెలుగు ప్రజలకు CM రేవంత్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అంతా ఆనందంగా జరుపుకోవాలి. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్-2047 విజన్​ సాకారం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.

News January 13, 2026

రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

image

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.