News August 22, 2025

సంగారెడ్డి: పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించిన ఎస్పీ

image

వివిధ కేసుల్లో జీవిత ఖైదు పడేలా వాదనలు వినిపించిన పీపీలను ఎస్పీ పారితోష్ పంకజ్ కార్యాలయంలో గురువారం సన్మానించారు. పీపీలు శైలజ, విజయశంకర్ రెడ్డి, సత్యనారాయణ, రాజేశ్వర్, సూర్ రెడ్డిలను అభినందించి రివార్డులు అందించారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా తమ వాదనలు వినిపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 24, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.

News January 24, 2026

నెల్లూరు: అటవీ శాఖ సగానికి.. సగం ఖాళీ..!

image

జిల్లాలోని రాపూరు, ఆత్మకూరు, నెల్లూరు, కావలి, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో 2.29 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగా అటవీశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 167 పోస్టులకు 85 ఖాళీలు ఉండగా.. వాటిల్లో DRO 10 పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయి. FSO 21 పోస్టులకు 7, FBO 75 పోస్టులకు 22, ABO 61 పోస్టులకు 57 ఖాళీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం పక్కదారి పట్టడానికి ఇదొక కారణమని తెలుస్తోంది.

News January 24, 2026

రంజీ మ్యాచ్: ఆంధ్ర 228 రన్స్‌కు ఆలౌట్

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర <>జట్టు<<>> 228 రన్స్‌కు ఆలౌట్ అయింది. అభిషేక్ రెడ్డి 73, సౌరభ్ కుమార్ 62, నితీశ్ 35 పరుగులతో రాణించారు. విదర్భ బౌలర్లు సమష్టిగా రాణించి ఆంధ్ర బ్యాటర్లను దెబ్బతీశారు. రెండు రోజుల ఆట ముగియగా విదర్భ 71 రన్స్ లీడ్‌లో ఉంది. నేడు, రేపు మ్యాచ్ కొనసాగనుంది. భారత క్రికెటర్లు KS భరత్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర టీమ్ తరఫున ఆడుతున్నారు.