News October 8, 2025
సంగారెడ్డి: పాఠశాలలో తనిఖీ చేయాలి: డీఈవో

సమగ్ర శిక్షలో పనిచేసే సెక్టోరియల్ అధికారులు రెగ్యులర్‌గా పాఠశాలను తనిఖీ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలా చదువుతున్నారో నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా పరిశీలన చేయాలని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
మహిళా సంఘాల బలోపేతానికి ప్రాధాన్యత: కలెక్టర్

జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ జీవనోపాధి విస్తరణపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సెర్ప్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాల భవనాల నిర్మాణం, భూసేకరణ, భూ పరిపాలన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులు పూర్తి చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆదేశించారు.
News January 20, 2026
పాలమూరు: దివ్యాంగుల పరికరాలు కోసం దరఖాస్తు చేసుకోండి

దివ్యాంగులకు, వయోవృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిందని మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల శాఖ అధికారి మంగళవారం తెలిపారు.. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వారు ఈనెల 30వ తేదీలోపు https://tgobmms.cgg.gov.in ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. బ్యాటరీ వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, ల్యాప్‌టాప్స్, టాబ్స్ ఉచితంగా అందజేస్తుందని తెలిపారు.
News January 20, 2026
MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.


