News June 17, 2024

సంగారెడ్డి: పెళ్లి చేయడంలేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి చేయడంలేదన్న మనస్తాపంతో<<13453836>> యువకుడు సూసైడ్<<>> చేసుకున్నాడు. SI అంబార్య వివరాలు.. మహారాష్ట్రకు చెందిన బాలాజీ(31) కుటుంబం కొన్నేళ్లుగా తిమ్మాపూర్‌లో ఉంటుంది. HYDలో పనిచేస్తున్న బాలాజీ.. తనకు పెళ్లి చేయాలని కోరుతున్నా కుటుంబీకులు పట్టించుకోలేదు. ఇటీవల గ్రామానికి వచ్చిన బాలాజీ ఆదివారం తాగిన మైకంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. బాలాజీ తల్లి మీరాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Similar News

News January 21, 2026

వైద్య విద్యలో హైటెక్ విప్లవం: మంత్రి రాజనర్సింహ

image

రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అందుబాటులోకి తెచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందించాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ తరహాలోనే కొత్త కాలేజీల్లోనూ మెరుగైన విద్య ఉండాలని, ఇందుకోసం AI ఆధారిత లెర్నింగ్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 21, 2026

మెదక్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News January 21, 2026

మెదక్: టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

image

మెదక్ పురపాలక సంఘంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు నిన్న చేసిన సూచన మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 32 వార్డుల నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ స్వీకరించారు. మాజీ ఛైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు.