News September 12, 2025

సంగారెడ్డి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

Similar News

News December 9, 2025

స్టార్ బ్యాటర్ అంజుమ్ చోప్రా గురించి తెలుసా?

image

ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న అంజుమ్ చోప్రా గతంలో భారత జట్టులో కీలకపాత్ర పోషించారు. 18 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఈ దిల్లీ క్రికెటర్‌ IND తరఫున 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. స్టార్ బ్యాటర్ అయిన ఆమె నాలుగు ప్రపంచ కప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం మీద 127 వన్డేలు, 12 టెస్టులు, 18 టీ20లు ఆడారు. 2007లో అర్జున అవార్డు, 2014 పద్మశ్రీ అందుకున్నారు.

News December 9, 2025

MBNR: ఓటర్ లిస్ట్.. చెక్ చేసుకోండి ఇలా!

image

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ జిల్లాల్లో ప్రతి మండలానికి సంబంధించి గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లిష్ ఫార్మాట్లలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంది. గ్రామం, వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెలుసుకోవడానికి https://finalgprolls.tsec.gov.in <>వెబ్‌సైట్<<>> పై క్లిక్ చేయండి. జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. వివరాలు మీకు కనిపిస్తాయి.

News December 9, 2025

కర్నూలు: విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

image

తిరుపతిలో ఓ కళాశాల విద్యార్థిని (బాలిక)పై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. కర్నూలు(D) కోడుమూరుకు చెందిన విద్యార్థి తిరుపతిలో హాస్టల్‌కు మారే క్రమంలో పరిచయమైన డ్రైవర్ డబ్బు సాయం చేస్తానని నమ్మబలికి బాలికను గదికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.