News February 4, 2025

సంగారెడ్డి: ప్రజావాణికి 63 ఫిర్యాదులు

image

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వారితో పాటు డీఆర్వో పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Similar News

News January 20, 2026

23న రాజధాని రైతులకు ఇ-లాటరీ: నారాయణ

image

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. ‘అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈనెల 23న కేటాయిస్తాం. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు.

News January 20, 2026

మాఘ మాసంలో నదీ స్నానాలు ఎందుకు చేయాలి?

image

మాఘ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శాస్త్రీయంగా చూస్తే.. ఈ సమయంలో సూర్యకిరణాలు ప్రత్యేక కోణంలో భూమిని తాకుతాయి. వాటిలోని అతినీల లోహిత సాంద్రత వల్ల ప్రవహించే నీటిలో చేసే స్నానం శరీరానికి గొప్ప శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చలిని తట్టుకుని చేసే ఈ మాఘ స్నానం మనోబలాన్ని పెంచుతుంది.

News January 20, 2026

NZB: 21, 22 తేదీల్లో ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు: DIEO

image

ఈనెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పని సరిగా హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు గైర్హాజరైనా వారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.