News August 22, 2025

సంగారెడ్డి: మట్టి వినాయకులను పూజించాలి: కలెక్టర్

image

పర్యావరణానికి హాని చేయని మట్టి వినాయకులను పూజించాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. గురువారం హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను కలెక్టర్‌కు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో అనిల్, నాగేష్ ఉన్నారు.

Similar News

News January 14, 2026

భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

image

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

News January 14, 2026

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

image

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.

News January 14, 2026

మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

image

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.