News February 2, 2025
సంగారెడ్డి: ‘మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు’

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డిలోని జడ్పీ కార్యాలయంలో పని మహిళలకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు వారి హక్కులు చట్టాలపై అవగాహన ఉండాలని చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
స్టార్టప్‌ల వృద్ధిలో టీ-హబ్ కీలకపాత్ర: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలోని ప్రఖ్యాత ఇన్నోవేషన్ కేంద్రం టీ-హబ్ బ్రెజిల్‌కు చెందిన హబ్ ఆఫ్ గోయాస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలోని స్టార్టప్‌లు బ్రెజిల్ మార్కెట్‌లో అవకాశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అలాగే 2 దేశాల స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కానుందన్నారు. స్టార్టప్‌ల వృద్ధిని ప్రోత్సహించడంలో టీ-హబ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
News February 19, 2025
మస్కిటో కాయిల్ ఎంత పని చేసింది!

AP: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో <<15497063>>అగ్నిప్రమాదం ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగు చూశాయి. మస్కిటో కాయిల్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బెడ్ పక్కనే కాయిల్ పెట్టుకొని విద్యార్థి పడుకోవడంతో ఫ్యాన్ వేగానికి మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో పొగ గది మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 70 మంది విద్యార్థులున్న గదికి ఒకటే ద్వారం ఉండటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
News February 19, 2025
విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.