News March 7, 2025

సంగారెడ్డి: మహిళలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: జిల్లా జడ్జి

image

మహిళలు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళల పాత్ర గొప్పదని చెప్పారు. నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు గౌరవం పొందుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

image

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్‌ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.

News December 16, 2025

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

పాత నేరస్తులపై నిఘా పెట్టండి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. గతంలో చోరీలకు పాల్పడిన నిందితుల సమాచారాన్ని, వారి కదలికలను నిరంతరం సేకరించాలని సూచించారు. వారిపై గతంలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత నివాసంపై దృష్టి సారించి నిఘా పెట్టాలని ఆదేశించారు.