News September 12, 2025

సంగారెడ్డి: రూ.2.85 కోట్ల నిధులు విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రూ.2.85 కోట్లు నిధులు విడుదలైనట్లు వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ పథకం కింద 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వంట ఖర్చులు, వంట సహాయకులకు ఏప్రిల్, జూన్ నెలలకు సంబంధించి గౌరవ వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.

Similar News

News December 6, 2025

SRCL: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి ఇన్‌ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు నియామక పత్రం, ఫామ్-14, ఎపిక్ కార్డు తీసుకుని తమ సొంత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి అందజేయాలన్నారు.

News December 6, 2025

చెలరేగిన ప్రసిద్ధ్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు

image

SAతో ODI సిరీస్‌లో పేలవ బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న IND బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎట్టకేలకు రిథమ్ అందుకున్నారు. విశాఖలో జరుగుతున్న 3వ ODIలో ఫస్ట్ 2ఓవర్లలో 27రన్స్ సమర్పించుకున్న ఆయన.. తన సెకండ్ స్పెల్‌లో ఒకే ఓవర్‌లో బ్రిట్జ్‌కే, మార్క్రమ్‌ను, అనంతరం డికాక్‌(106)ను క్లీన్‌బౌల్డ్‌ చేశారు. ప్రస్తుతం 7 ఓవర్లలో 52 పరుగులిచ్చి వికెట్లు పడగొట్టారు. అటు కుల్దీప్ సైతం ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు.

News December 6, 2025

విశాఖలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌తో పాటు EROలు, AEROలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు. 2002 నాటి జాబితాను 2025తో సరిపోల్చాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 24.54% మ్యాపింగ్ పూర్తైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివరించారు. వలసల వల్ల క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.